కేరళ...వరదలతో విలవిల

Update: 2018-08-17 13:36 GMT

గత వందేళ్లలో కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన అతి పెద్ద వరద ఇదే. ఏకంగా అక్కడ 80 డ్యామ్ ల గేట్లు ఎత్తేశారు. రహదారుల వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. ఏకంగా విమానాశ్రయాన్ని మూసేశారు. వేలాది మంది నిరాశ్రయులను క్యాంప్ లకు తరలించారు. ప్రధాని నరేంద్రమోడీ కేరళలో వరద పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ తో మాట్లాడి తెలుసుకున్నారు. మోడీ శనివారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదల్లో గత మే నెల నుంచి ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. కేరళకు విరివిగావిరాళాలివ్వాల్సిందిగా మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళకు మద్దతు ఇవ్వండంటూ ఒక ఆన్‌లైన్‌ డొనేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించింది. కేరళ విద్యుత్‌ బోర్డు పవర్‌కట్‌ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది.

కొబ్బరి, కాఫీ, నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు. ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది.

 

 

Similar News