వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ చెపితే రాలేదు..బిజెపి అడిగితే పార్టీ లేదు. ఒంటరిగానే పోటీచేస్తాం. అధికారంలోకి వస్తాం. దేవుడి దయ..ప్రజల ఆశీస్సులే మనకు ముఖ్యం. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు. ఆమె గురువారం నాడు పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఏప్రిల్ 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టారు. అయితే కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ప్రజల మధ్య ఈ సభ జరిగే అవకాశం ఉంది. ఖమ్మం పోలీసులు ఆరు వేల మందితో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.