సిఆర్ పీఎఫ్ వాళ్ళు మా అబ్బాయిని కొట్టారు..కేసు పెడతాము

Update: 2022-11-23 05:26 GMT

ఐ టి దాడులపై మంత్రి మల్లా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే ఇది అంతా సాగుతోందని ఆరోపించారు. సిఆర్ పీ ఎఫ్ వాళ్ళు తన కొడుకును ఛాతీపై కొట్టినట్లు ఉన్నారు..అందుకే ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారని చెప్పారు. చివరకు తనను కూడా చూడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించి...ఆస్పత్రి ముందు కాసేపు ధర్నా చేశారు. ఐటీ రైడ్స్ కొనసాగుతుండగానే కుమారుడిని సూరారంలోని నారాయణ హృదయాలయకు మంత్రి మల్లారెడ్డి తరలించారు. ఆసుపత్రి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ, ఆస్పత్రి ఇతర వ్యాపార సంస్థలపై సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల ముందు నుంచే తనిఖీలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఐటి వాళ్లపై పోలీస్ కేసు పెడతామని మంత్రి మల్లా రెడ్డి తో పాటు ఎమ్మెల్యే వివేకానంద కూడా తెలిపారు. చట్టపరంగా ఐ టి దాడులు చేయవచ్చు కానీ ఇలాంటి బెదిరింపు ధోరణలు సరికాదని మండిపడ్డారు. తాను ఎంతో కస్టపడి పైకి వచ్చానని..ఐటి దాడుల్లో ఏమి దొరకలేదని చెప్పారు. ఎవరి దగ్గరో డబ్బు ఉంటే అది తనది ఎలా అవుతుంది అని ప్రశ్నించారు.

Tags:    

Similar News