రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-01-25 08:29 GMT

ఓ వైపు అధికార టీఆర్ఎస్ లో అందరూ ముఖ్యమంత్రి బాధ్యతలు కెటీఆర్ చేపట్టాలంటూ ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమంటూ అభిప్రాయపడ్డారు. సోమవారం మహబూబాబాద్‎లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన ఆయన.. తాను అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు సృష్టించారు.

తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానన్నారు. ఇప్పుడు మాట, పాట అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ పోయిందని ఇలాంటి జీవితం నేను కోరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆకలిని అయినా చంపుకొని ఆత్మాభిమానంతో బతికేవాడిని తానన్నారు. అందరి ఆశీస్సులు వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నానన్నారు. పవర్ ఉంటేనే మాకు చప్పట్లు కొడుతుంటారు. పండగలు కూడా వ్యక్తుల పేరు మీదుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News