టీఆర్ఎస్ మేనిఫెస్టో సేమ్ టూ సేమ్

Update: 2020-11-23 13:25 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు విడుదల చేసిన టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేనిఫెస్టోపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2006 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా సేమ్ టూ సేమ్ దించేశారని ఆరోపించారు. చివరకు మేనిఫెస్టోపై కెసీఆర్ ఫోటో కూడా మార్చలేదన్నారు. పాత హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తారా? అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అక్షరం పొల్లుపోకుండా పాత మేనిఫెస్టోనే మళ్లీ ప్రకటించారని చెప్పారు. సెలూన్లు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారని అన్నారు. వరదలకు ప్రజలు ప్రాణాలు పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం లేదన్నారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు ట్రాఫిక్ ఫ్రీ నగరం అని చెబుతున్నారని.. నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసన్నారు.

Tags:    

Similar News