శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదు

Update: 2021-06-30 14:52 GMT

ఇది తెలంగాణ‌. ఇక్క‌డ సీఎంగా ఉన్న‌ది కెసీఆర్. మీ కుప్పిగంతులు ఇక్క‌డ సాగ‌వు అంటూ ఏపీ స‌ర్కారుపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ తీరుపై ప్ర‌ధాని మోడీకి, కెఆర్ఎంబీ ఫిర్యాదు చేయాల‌ని ఏపీ మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకున్న త‌రుణంలో మంత్రి వ్యాఖ్య‌లు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని,నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణా ప్రభుత్వం ఏమి చెయ్యాల‌న్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానిస్తే అమలు పరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరన్నారు. విద్యుత్ ఉత్పత్తి త‌మ హక్కు అని అపమనే హక్కు ఏ కమిటీకి,కమిషన్ లకు లేదని ఆయన స్పష్టం చేశారు. పాతపద్దతిలో అరాచకాలు చేస్తాం అంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ రూల్స్ లేకుండా కట్టిన ప్రాజెక్టు లు పోరంబోకు ప్రాజెక్టులుగా మార్చినట్లు ఇప్పుడు కూడా అలానే చేద్దాం అని అమాయకంగా పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో....కృష్ణా నదిలో మా వాటా ఎంతనో మాకు స్పష్టంగా తెలుసు అని మా వాటలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ యిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని గతంలో చేసిన తప్పులను తిరిగి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వాళ్లకు సరయిన పద్దతిలో సేవచేయలే గాని ఇటువంటి కుప్పిగంతులు వేయడం తగదన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని సముద్రం పాల‌య్యే నీళ్లను ఏ పద్దతిలో వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో గొప్ప ఆలోచనతో విజ్ఞత తో చెబితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మూర్ఖంగా ఏకపక్షంగా, అహంకార పద్దతిలో పోతుందని మండిపడ్డారు. ఒకప్పుడు తెలంగాణా నాయకత్వాన్ని మీ బానిసలుగా మార్చుకుని చేసినట్లు చేస్తే చూస్తూ ఊరుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పధకం ముమ్మాటికి అక్రమమేనని,దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు ను వెడల్పు చేసి ప్రయత్నంలో నిజం లేదా అని ఆయన ఎపి సర్కార్ ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. 

Tags:    

Similar News