తెలంగాణ నూతన సచివాలయం టెండర్లు ఖరారు అయ్యాయి. కేవలం రెండు సంస్థలే బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ పని కోసం ప్రముఖ మౌలికసదుపాయాల కంపెనీలు అయిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీలు పోటీపడ్డాయి. అయితే ఎల్ 1గా షాపూర్జీ పల్లోంజీ నిలిచినట్లు సమాచారం. 12 నెలలలోపు నిర్మాణం పనులు పూర్తి చేయాలనే ఖచ్ఛితమైన నిబంధనను ప్రభుత్వం పెట్టింది.
దీంతో పలు ప్రముఖ సంస్థలు కూడా వెనక్కితగ్గాయి. పన్నెండు నెలలు కాకుండా మరి కొంత సమయం పెంచాలని నిర్మాణ సంస్థలు ప్రీ బిడ్ సమావేశం సమంయలో కోరినా ఆర్అండ్ బి శాఖ నో చెప్పింది. టెండర్లు ఖరారు కావటంతో నూతన సచివాలయం పనులు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.