మద్యం దుకాణాలు..పబ్ లే ముఖ్యమా?

Update: 2021-04-19 07:16 GMT

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఎక్కడ అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వానికి మద్యం దుకాణాలు, పబ్ లే ముఖ్యమా? అని ప్రశ్నించింది. ఓ వైపు ప్రజలు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడుతుంటే ప్రభుత్వానికి ఆదాయమే ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లతోపాటు జన సంచారం తగ్గించేందుకు తీసుకున్న చర్యల వివరాలు నివేదికలో ఎక్కడ అంటూ సర్కారు తీరును తప్పుపట్టింది. తాము అడిగిన వివరాలు ఏవీ నివేదికలో ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్టు లు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించింది. పబ్లిక్ గుమిగూడటంపై చర్యలు తీసుకోవాలని చెప్పినా చర్యలు తీసులేదు.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు కూడా సరిగా చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

14 అదనపు సెంటర్లకు అనుమతి అన్నారు.. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. కేసులు తీవ్రంగా ఉన్నాయి.. పలు జిల్లాల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. జిల్లాలోని అధికారులు ఇచ్చే కేసుల లెక్కలకు.. ప్రభుత్వం ఇచ్చే కేసులకు భారీ తేడా ఉంది.విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాలి.. చర్యలకు సంబంధించిన సర్క్యులర్లు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. జన సంచారాన్ని నియంత్రించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని ఏజీ వెల్లడించగా..హైకోర్టు సీరియస్ గా స్పందించింది. చర్యలు మీరు తీసుకుంటారా?. మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా? అని ప్రశ్నించింది.

Tags:    

Similar News