దావోస్ లో తెలంగాణ సక్సెస్

Update: 2025-01-23 13:27 GMT

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ రాని రీతిలో ఈ సారి రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. దావోస్ వేదికగా కుదిరిన ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి 1,78,950 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నట్లు సర్కారు అధికారికంగా వెల్లడించింది. ఈ పెట్టుబడులతో కొత్తగా దగ్గర దగ్గర ఏభై వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది అని అంచనా వేశారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం పాల్గొని పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో అతి పెద్ద పెట్టుబడి అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ దే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరించనుంది.

                                                             సన్ పెట్రోకెమికల్స్ కంపెనీ కూడా రాష్ట్రంలో 45 , 500 కోట్ల పెట్టుబడితో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్రానికి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కూడా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ తో పాటు ప్రపంచ శ్రేణి వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ మొత్తం 15000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలతో ఒప్పందం చేసుకుంది.

                                           దిగ్గజ ఐటి కంపెనీ లు అయిన హెచ్ సిఎల్ , ఇన్ఫోసిస్, విప్రో లు కూడా తమ కార్యకలాపాలు విస్తరించటం ద్వారా కొత్తగా హైదరాబాద్ లో మొత్తం 27 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జిందాల్ సంస్థ రాష్ట్రంలో డిఫెన్సె రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు పలు ఇతర సంస్థలు కూడా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తో ఎంఓయూ లు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్టానికి ఉన్న అడ్వాంటేజ్ ను దావోస్ వేదికగా ఉపయోగించుకుంది అనే చెప్పాలి. దీంతోనే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

Tags:    

Similar News