తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

Update: 2021-01-21 12:21 GMT

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు అవుతున్న ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. తాజాగా హైకోర్టు కూడా రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవటంపై ప్రశ్నలు సంధించింది. కేంద్రం ఆమోదించిన చట్టాన్ని ఎందుకు అమలు చేయటంలేదని ప్రశ్నించింది. రాజకీయంగా కూడా అధికార టీఆర్ఎస్ పై ఈ అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ తరుణంలో కెసీఆర్ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరనుంది.దీనిపై కేసీఆర్‌ రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత అధికారులకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారని తెలిపారు.

Tags:    

Similar News