టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంకా ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ పత్రికలో వచ్చిన వార్తతో సహా ట్వీట్ చేస్తూ సర్కారు తీరుపై మండిపడ్డారు. 'జీతమో రామ"చంద్రా" అంటున్నారు ఉద్యోగులు!. సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవ్. వంతులవారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు లేదు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?' అంటూ ప్రశ్నించారు.