ఉండ‌వల్లి అడ్డా కూలీగా మారొద్దు..రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-06-14 12:13 GMT

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారన్నారు. సీఎం కెసీఆర్ ఇంట్లో కి పిలిచి ఉండవల్లి కి ఏం చెప్పారో. కేసీఆర్ పంచన చేరి ..ఉండవల్లి భజన చేయడం తో ప్రజల్లో ఉండవల్లి కి ఉన్న గౌరవం పోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీజేపీ పై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతి పై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదు..ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ ఇచ్చిన నోటీసుల‌కు వ్య‌తిరేకంగా రెండ‌వ రోజు కూడా హైద‌రాబాద్ లోని ఈడీ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించిన త‌ర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన పై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారు అని..రెండు పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటును ఆయ‌న తప్పు బట్టారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ ను విమర్శించారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలసి పనిచేయమంటరా..సార పాతదే..సీత కొత్తది అన్నట్లు.. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తరట. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళంతా.. బీహార్ వాల్లే. టిఆర్ఎస్ కాదు.. అది బీహార్ రాష్ట్ర సమితి. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దు.తెలంగాణ ను వ్యతిరేకించిన ఉండవల్లి ని కేసీఆర్ దగ్గరకు తీస్తే..తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చ‌రించారు. కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను 1937లో నెహ్రూ ప్రారంబిస్తే..స్వాతంత్య్ర ఆనంతరం అప్పులతో పత్రిక మూతపడిందని తెలిపారు.

దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావాజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ ను కాంగ్రెస్ ఊపిరి పోసి పున ప్రారంబించింది.. లాభాపేక్ష లేని యంగ్ ఇండియా సంస్థ లు ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదు.బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశార‌ని రేవంత్ ఆరోపించారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్ట్ కు వెళ్ళినా..మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల లో ఎలాంటి అవినీతి జరగలేదు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తుందనే భయం బీజేపీ లో మొదలైందని వ్యాఖ్యానించారు. అందుకే మూసేసిన కేసులో లో నోటీసులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మామూలుగా అయితే ఐదు గంటల వరకే విచారణ మంగించాల్సింది కానీ..ఈడీ ఆఫీస్ లో రాహుల్ గాంధీ ని 12 గంటల పాటు కూర్చోబెట్టారన్నారు. తల్లి హాస్పిటల్ లో ఉంటె..కొడుకు ను గంటల కొద్ది విచారణ పేరు తో ఉంచారు.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదని హెచ్చ‌రించారు. ఈ దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్దమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి ఇంతకు ఇంతా మిత్తి తో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు... అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండ‌వ రోజు కూడా ఈడీ ఢిల్లీలో రాహుల్ గాంధీని నాలుగు గంట‌ల పాటు విచారించింది. 

Tags:    

Similar News