అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పై టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన పిర్యాదుపై పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేసినా..అందులోని సెక్షన్ల పట్ట ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే ఆయన మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుంటే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకుంటానని తెలిపారు. శర్మ చేసిన విమర్శలు రాహుల్ గాంధీపై చేసినవి కావని..దేశంలోని మహిళామూర్తులపై చేసినవి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల కాంగ్రస్ నాయకులు, కార్యకర్తలు ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ బుధవారం నాడు పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చారు. జూబ్లిహిల్స్ స్టేషన్ పోలీసులు పెట్టిన ఐపీసీ 504, 505(2) సెక్షన్లపై టీపీసీసీ చీఫ్ అభ్యంతరం తెలిపారు.153A,505(2),294,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రేవంత్‌కు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారరి.. కానీ అందులో సెక్షన్లు సరైనవి కాదన్నారు. నేర తీవ్రతను తగ్గించినందుకు నిరసన తెలియజేశామని తెలిపారు. రాహుల్‌పై వ్యాఖ్యలను అసోం సీఎం సమర్థించుకుంటున్నారన్నారు. సభ్యసమాజంలో మనుషులు మాట్లాడే భాష మాట్లాడలేదని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని, మహిళలను కించపరిచేలా మాట్లాడారన్నారు. అసోం సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, మోదీ సర్కార్ వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరసనలకు బయటకు రాకుండా రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటికి కార్యకర్తలు కూడా రాకుండా పోలీసులు భద్రత పెట్టారు.