కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో నెలకొన్న ధాన్యం సేకరణ వివాదంపై స్పందించారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. 'తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.' అని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి ఈ విషయంలో టీపీపీసీ కూడా దూకుడు పెంచనుంది. ధాన్యం సేకరణ అంశంలో అటు కేంద్రంలో ఉన్న బిజెపి, ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.