ప్రజల నుంచి కూడా ఈ యాత్ర కు మంచి స్పందన ఉంది. అయితే దీపావళి సందర్భంగా యాత్ర కు మూడు రోజులు బ్రేక్ ఇస్తున్నారు. తిరిగి తెలంగాణ లో ఈ యాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ లో రాహుల్ యాత్ర మొత్తంమీద 12 రోజులు, 375 కిలోమీటర్ల మేర సాగనుంది. అయితే ఈ యాత్ర ను తెలంగాణ కాంగ్రెస్ ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది అన్నది వేచిచూడాల్సిందే. నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటే ఆ ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు నిరూపితం అయింది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యాత్ర పై భారీ ఆశలే పెట్టుకుంది. త్వరలోనే కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఫ్యూచర్ కు ఇవి కూడా కీలకంగా మారనున్నాయి.