కారులో కోటి..రఘునందన్ రావు బావమరిది అరెస్ట్

Update: 2020-11-01 11:46 GMT

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగింపు రోజు కీలక పరిణామాలు. అధికార టీఆర్ఎస్ బిజెపిపై ఎటాక్ ప్రారంభించింది. ఎలాగైనా గెలించేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆదివారం నాడు హైదరాబాద్ లో కారులో కోటి రూపాయల నగదు దొరికింది. అలా దొరికిన వెంటనే పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'పట్టుబడ్డ నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుది అని గుర్తించాం.

శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్‌ రవి కుమార్‌ను అరెస్ట్‌ చేశాం. బేగంపేట ఫ్లైఓవర్‌ సమీపంలో ఈ నగదును పట్టుకున్నాం. స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో చాలా కీలక సమాచారం సేకరించాం. కాల్‌ లిస్ట్‌ లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్‌ ఫోన్‌ చేశాడు. కోటి రూపాయిలకు పైగా హవాలా నగదును పట్టుకున్నాం. ఈ నగదును విశాక ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు వెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు' అని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

Tags:    

Similar News