రాష్ట్రంలో క‌రోనా ఆంక్షలు తొల‌గింపు..థర్డ్ వేవ్ ముగిసింది

Update: 2022-02-08 08:29 GMT

తెలంగాణ స‌ర్కారు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసిపోయింద‌ని రాష్ట్ర హెల్త్ డైర‌క్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస‌రావు ప్ర‌క‌టించారు. తెలంగాణ క‌రోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉంద‌న్నారు. ఫస్ట్ వేవ్ 10నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని తెలిపారు. దేశానికి తెలంగాణ రాష్ట్ర ఫీవర్ సర్వేఆద‌ర్శంగా నిలిచింద‌ని అన్నారు. వ్యాక్సిన్ వల్లే థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకున్న‌ట్లు పేర్కొన్నారు.

వచ్చే వారం రోజుల్లో 100 కేసులు మాత్రమే వస్తాయని, ఫీవర్ సర్వే ఇంకా నడుస్తోందని వెల్ల‌డించారు. కొత్త వేరియంట్లు వచ్చినా ప్రమాదం లేదని, రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని తెలిపారు. ఐటి సంస్థలు కూడా ఫిజికల్ గా ఉద్యోగులను ఆఫీస్ లకు పిలవాలన్నారు. రాష్ట్రంలో మళ్ళీ ఆర్థిక స్థితిగతులను గాడిన పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

Tags:    

Similar News