ముఖ్యమంత్రి కెసీఆర్ సిద్ధిపేట పర్యటన ముగించుకుని వస్తున్న మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి హరీష్ రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ బయలుఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో ప్రమాదం జరిగింది.
కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ క్రమంలోనే మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్నకారు పైలెట్ కారును ఢీకొంది. ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు..గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి, హరీష్ రావు మరోకారులో హైదరాబాద్ వెళ్ళారు. మంత్రి కారు ముందు భాగం కొంత ధ్వంసం అయింది. కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఘటన జరిగింది.