కాళేశ్వరం లో కెసిఆర్ ...ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్

Update: 2024-12-28 12:39 GMT

అంతా బాగున్నప్పుడు నేనే నేనే అని చెప్పుకోవటం. విషయం కేసు ల వరకు రాగానే మాకేమి సంబంధం. అధికారులు కదా చూసుకోవాల్సింది అనే రాగం అందుకోవటం. అంటే ఏదైనా క్రెడిట్ ఉంటే ఆ మొత్తం తామే తీసుకోవాలి... బ్లేమ్ ఏదైనా ఉంటే అది అధికారుల మీదకు నెట్టాలి అన్నట్లు ఉంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల తీరు. ఇద్దరూ ఇప్పుడు అదే మోడల్ ఫాలో అవుతున్నారు. తెలంగాణ లో అత్యంత వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తానే రక్తాన్ని రంగరించి..చెమటోడ్చి డిజైన్ లు చేసినట్లు కెసిఆర్ మీడియా సమావేశాలతో పాటు పలు బహిరంగ వేదికల మీద చెప్పుకున్నారు.

                                         కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టిన బ్యారేజ్ లు కొన్ని ఎప్పుడైతే పనికిరాకుండా పోయాయో అప్పుడు కెసిఆర్ రివర్స్ గేర్ వేశారు. డిజైన్లు అన్ని ఇంజినీర్లు చూసుకుంటారు అని...వాటితో తనకు ఏమి సంబంధం అంటూ ఒక ఇంటర్వ్యూ లో ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు కేటీఆర్ కూడా పయనించారు. ప్రస్తుతం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఫార్ములా ఈ రేస్ కేసు. కొద్ది రోజుల క్రితమే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగింది అని...ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాను చెప్పినట్లే అధికారులు చేశారు అని..అధికారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కానీ ఈ మాటలు చెప్పిన కొద్ది రోజుల్లోనే కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో ఏదైనా నిబంధనల ఉల్లంఘన ఉంటే అది అధికారులు చూసుకోవాలి కానీ...మంత్రిగా ఉన్న తనకు ఏమి సంబంధం అంటూ కోర్టు లో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు తనకు ఎలాంటి అధికారాలు ఉండవు అని...అలాంటప్పుడు ఈ విషయంలో తన పాత్ర ఏమి ఉంటుంది అని పేర్కొన్నారు.

కేటీఆర్ ఫస్ట్ అధికారుల తప్పేమి లేదు...అంతా తాను చెప్పినట్లే చేశారు అని ప్రకటించి..ఇప్పుడు కోర్టు దగ్గర కు వచ్చేటప్పటికి నిబంధనల ఉల్లంఘనలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పటం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ ఇటీవల మంత్రి కేటీఆర్ కు నోటీసు లు జారీ చేసింది. జనవరి 7 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి కి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు జనవరి 2 , 3 తేదీల్లో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీంతో కేటీఆర్ ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు తో పాటు ఈడీ కేసు ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News