కోకాపేట భూముల వేలంపై స‌ర్కారు వివ‌ర‌ణ‌

Update: 2021-07-20 11:36 GMT

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ భూముల విక్ర‌యం ఇప్పుడు కొత్త‌గా ప్రారంభించింది కాద‌ని..ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి కూడా ఇది అమ‌ల్లో ఉంద‌ని తెలంగాణ స‌ర్కారు వివ‌ర‌ణ ఇచ్చింది. నగర అభివృద్ధికి దోహద పడే అత్యంత వ్యూహాత్మక ప్రదేశాలైన కోకాపేట్, ఖానామెట్ భూముల వేలం దృష్టిలోపెట్టుకొని చేపట్టడం జరిగింది. నిజానికి ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూముల వేలం ఇదివరకే జరిగింది మరియు ఇప్పటి వేలం కేవలం ఒక కొనసాగింపు ప్రక్రియ మాత్రమే అని తెలిపారు. కోకాపేట, ఖానామేట్ భూముల వేలం లో పోటీని నిలువరించామని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ ను తగ్గించామని, బిడ్డింగ్ లో కొన్ని సంస్థలకు మేలు చేశామనే ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, ఊహాతీతమైనవి గా ప్రకటిస్తున్నాము. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, ఇటువంటి పారదర్శకమైన పద్దతిని తప్పు పట్టడం మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించ బోమని వెల్లడిస్తున్నాము.

ఇకముందు ఇలాంటి కల్పిత ఆరోపణల పై న్యాయ పరమైన పరువు నష్టం చర్యలు తీసుకోవటం జరుగుతుందని స్పష్టం చేస్తున్నామ‌ని తెలిపారు. ఎలాంటి వేలం పాటలోనైన "కనీస నిర్ణీత ధర" (upset price) నిర్ధారించి వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ, వేలంపాటలోను విజయవంతం చేసే విధంగా నిర్ణయించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వేలం పాటలో కనీస నిర్ణీత ధరను ఎకరాకు రూ. 25.00 కోట్లుగా నిర్ణయిస్తు ఆన్ లైన్ విధానం ద్వార పాటదారులు రూ. 20.00 లక్షలు మరియు ఆ విలువకు బహులంగా పెంచుకొనే వెసులుబాటు కల్పించారన్నారు. అంతే కాదు ఈ భూముల‌ను స్విస్ ఛాలెంజ్ ప‌ద్ద‌తిలో విక్ర‌యించ‌టం సాధ్యంకాద‌ని..ఇందులో పోటీ కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు.

Tags:    

Similar News