జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకుంటున్న కెసిఆర్..కెటిఆర్

Update: 2023-02-07 03:47 GMT

స్వయంగా సుప్రీం కోర్ట్ చెప్పింది. డబ్బులు కట్టి పద్నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వాళ్ళ స్థలం వాళ్లకు అప్పగించామని..అందులో ఇల్లు కట్టుకోవటానికి అనుమతి ఇవ్వాలని. కానీ గత ఆరు నెలలుగా సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు అసలు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కెటిఆర్ మాత్రం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణకు కృతజ్ఞత లు తెలపటంతో పాటు ...జర్నలిస్ట్ లకు తాము ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది అని ట్వీట్ చేశారు. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఇందులో పెద్దగా స్పందన లేక పోగా..ఎప్పుడో మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు కట్టి పదిహేనేళ్ళుగా ఎదురు చూస్తున్న వారికి..ఈ సొసైటీ లో సభ్యులుగా లేనివారికి లింక్ పెట్టి ఇప్పుడు కొత్త రచ్చకు కారణం అవుతున్నారు. . అర్హులుగా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంటి జాగా ఇస్తుంటే వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పాత వాటికీ..ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్లకు లింక్ పెట్టి రచ్చ చేయటం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చిన వెంటనే తమ చుట్టూ ఉన్న వాళ్ళు..తమకు నమ్మకం ఉన్న వాళ్ళతో అయినా ఒక సమావేశం పెట్టి అర్హుల జాబితా తయారు చేయమని చెప్పటంతో పాటు మార్గదర్శకాలు కూడా ఇచ్చి ఉంటే ఆ పని ఎప్పుడో అయిపోయేది.

                                    కానీ ఆలా చేయకుండా..కనీసం జర్నలిస్టులకు సమయం కూడా ఇవ్వకుండా ఆరు నెలలు కాలం వెళ్లదీశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మంత్రి కెటిఆర్ అక్కడే కొంతమంది జర్నలిస్ట్ నేతలతో కలిసి అందరి సమస్య ఒకే సారి పరిష్కరిస్తాం అని చెప్పి సమస్యను మరింత జటిలం చేశారు. ప్రస్తుత సొసైటీ లో లేని జర్నలిస్టులు తమకు న్యాయం చేయాలనీ అడగాల్సింది ప్రభుత్వాన్ని. ఆలా కాకుండా మాకు ఇవ్వకుండా మీకు ఎలా ఇస్తారో చూస్తాం అనే తరహాలో ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే జర్నలిస్టులు బెదిరింపులకు దిగుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ బెదిరింపుల వ్యవహారం సాగుతుంది అనే చర్చ జర్నలిస్ట్ వర్గాలలో సాగుతోంది. అడగాల్సిన ప్రభుత్వాన్ని గట్టిగా అడగకుండా తోటి జర్నలిస్టులతో ఘర్షణ వాతావరణం సృష్టించటం..ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు...తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారు లేరు అంటూ కొత్త కొత్త అంశాలు తెరపైకి తీసుతున్నారు. కెసిఆర్ కాబినెట్ లోనే ఉద్యమంతో సంబంధంలేని వారు ఎంతో మంది ఉన్నారు...జర్నలిస్టులది ఏముంది.

Tags:    

Similar News