గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్లుగా ఉపయోగించుకునేందుకు వీలుగా వారితో శనివారం నాడే ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఈ కార్యక్రమం జరగనుంది.