గొర్రెకుంట హత్యల కేసు..నిందితుడికి ఉరి ఖరారు

Update: 2020-10-28 08:51 GMT

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు చేశారు. బుధవారం నాడు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. గత ఏడాది మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే బావిలో పడేసిన సంజయ్. మరుసటి రోజు తెల్లారి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఈ కేసుకు సంబంధించి 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 57మంది మంది వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు.

ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీ లో 9మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడిసి హత్యలు చేసిన నిందితుడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి బీహార్ కి చెందిన సంజయ్ కుమార్ యాదవ్. నిందితుడి పై పోలీసులు ఏడు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News