జీఎంఆర్ ఏరోసిటీ ప్రారంభం

Update: 2021-04-16 12:21 GMT

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ 1500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న 'ఏరోసిటీ'ని ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది. జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ బిజినెస్ పార్క్, రిటైల్ పార్క్, ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ పార్క్, ఆతిథ్యం మొదలైన వాటి కోసం ముఖ్యమైన నిర్మాణాలతో ఒక సమగ్రాభివృద్ధి దృక్పథంతో రూపొందించబడుతోంది. పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, రెంటల్ అకామిడేషన్, విశ్రాంతి, వినోదం వంటి మౌలిక సదుపాయాలతో జీవితం, పని విషయాలలో సంపూర్ణ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏరోసిటీ హైదరాబాద్‌లో ఉన్న GMR బిజినెస్ పార్క్ – రెడీ టు మూవ్ గ్రేడ్- A కార్యాలయాలు, బిల్ట్-టు-సూట్ క్యాంపస్‌లాంటి విభిన్న ఆఫీస్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్, 24/7 కార్యకలాపాల కోసం టెలికాం, విద్యుత్ & ఐటీలలో ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

డెడికేటెడ్ విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానమైన విద్యుత్ లింక్, రక్షా, రాష్ట్ర పోలీస్ మరియు సిఐఎస్‌ఎఫ్‌లతో కూడిన త్రీ-టైర్ సెక్యూరిటీ సిస్టమ్‌, నగరంతో వేగవంతమైన కనెక్టివిటీ; కాలుష్య రహిత మరియు ప్రణాళికాబద్ధమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. అన్ని బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కోసం వన్-స్టాప్ క్లియరెన్స్ విండోగా పని చేసే నోటిఫైడ్ ఏరియా కమిటీ (NAC) ఇక్కడ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు దోహదపడుతుంది. హైదరాబాద్ ఏరోసిటీ గ్రీన్ టెక్నాలజీ, కొత్త తరం స్మార్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉపయోగించుకుంటూ సుస్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. సుమారు ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, పలు దశల్లో అభివృద్ధి చేయబడుతున్న నాలుగు టవర్లలో (టవర్ 1 పూర్తిగా ఆక్రమించబడగా, టవర్ 2 ఆక్యుపెన్సీకి సిద్ధంగా ఉంది) విస్తరించిన జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ భవిష్యత్ వ్యాపార కారిడార్‌గా రూపొందించబడింది. ఈ బిజినెస్ పార్క్ - DR, BCP సైట్లు, గ్రేడ్ A కార్యాలయాలు, నెట్‌వర్క్ ప్లానింగ్ కార్యాలయాలు, సేల్స్ ఆఫీస్, R&D మొదలైన వాటికి సరైన ఎంపిక. అని తెలిపింది.

Tags:    

Similar News