ఇప్పుడు కొత్తగా టీడీపీ కూడా మళ్ళీ యాక్టీవ్ అయింది. ఈ తరుణం లో పొంగులేటి నిర్ణయంపై ఆయనతో ఉన్నవారు కూడా ఒకింత గందరగోళంలో పడుతున్నారని చెపుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ వైపు వెళితే బాగుంటుంది అని చెపుతుండగా పొంగులేటి మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక ఒక ముఖ్యనేత ఉన్నారని చెపుతున్నారు. అయన సూచన ప్రకారమే పొంగులేటి కదలికలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆ ముఖ్య నేతతో పొంగులేటి భేటీ కూడా అయ్యారు. దీని వెనక చాలా ప్లాన్స్ ఉన్నాయని ప్రచారం ఉంది. బీజేపీ లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తనతో పాటు తన వెంట ఉన్న వారికి కూడా సీట్లు ఇచ్చేలా బీజేపీ నుంచి అయన మాట తీసుకోనున్నారు. ఎందుకు అంటే బీజేపీ కి నిజానికి కూడా జిల్లాలో పెద్దగా పేరున్న నేతలు లేరని చెపుతున్నారు. ఎన్ని చేసినా కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీ సత్తా చాటడం అన్నది అంత తేలికైన విషయం కాదు అని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. అయితే పొంగులేటి ని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్కసారిగా ఒక కీలక పార్టీగా మారటం ఖాయం అనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.