ఇంకా ఉంది

Update: 2023-03-20 16:16 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విచారణ సా...గుతూ పోతోంది. సోమవారం నాడు ఢిల్లీ లో పది గంటలు పైగా విచారించిన ఈడీ ఆమెను మరోసారి మంగళవారం నాడు కూడా విచారణకు రావాలని ఆదేశించింది. సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటలు అయినా ఆమె బయటకు రాకపోవటంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బయటకు వచ్చి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కవిత నవ్వుతూ రావటం..కార్ లో ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు సాగారు. దీంతో ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

వాస్తవానికి కవిత మార్చి 16 న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కూడా ఆమె ఆ రోజు కేవలం లాయర్లను పంపి స్కిప్ చేశారు. అందుకే ఈడీ మరోసారి నోటీసు లు జారీ చేసి మార్చి 20 న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఆమె సోమవారం ఉదయమే విచారణకు వచ్చారు. మళ్ళీ కవితను విచారణకు పిలవటం తో ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ టెన్షన్ అలా కొనసాగుతూ పోనుంది. మార్చి 22 ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అయినందున మంగళవారం నాడు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.


Tags:    

Similar News