ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ విచారణ

Update: 2021-04-10 11:28 GMT

తెలంగాణలో శనివారం నాడు కొత్త కలకలం రేగింది. ఎప్పుడో సద్దుమణిగిపోయిన ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. శనివారం నాడు దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడుతోపాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, దేవికా రాణితోపాటు ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురి ఇళ్ళలో సోదాలు నిర్వహించారు.

శనివారం ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News