అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులు ప్రకటించింది. ఇందులో జర్నలిజం విభాగం నుంచి దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. అమర్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహాదారుగా ఉన్నారు. అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలు - గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది.
అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 సంవత్సరంలో స్థాపించబడిన లాభాపేక్ష లేని జాతీయ స్థాయి సంస్థ గా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. . తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఈ వేదిక ద్వారా అనేక సేవలందిస్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆటా అవార్డును దేవులపల్లి అమర్ కు అందజేశారు.