తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు హీరో చిరంజీవికి ఫోన్ చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన చిరంజీవితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కెసీఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. తనకు స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని ఇటీవల చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.