తెలంగాణ పీఆర్సీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

Update: 2021-03-21 10:33 GMT

రాష్ట్రంలో ఉద్యోగులు పీఆర్సీ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ పోతోంది. దీనికి తోడు వరస ఎన్నికలు కూడా ఈ ప్రకటనకు బ్రేక్ లు వేశాయని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్రం ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పీఆర్ సీ ప్రకటనకు ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికలు జరిగే జిల్లాలో రాజకీయ ప్రయోజనం పొందేలా దీనిపై ఎలాంటి హంగామా..ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.

దీంతో సర్కారు కు పీఆర్ సీ ప్రకటనకు ఎలాంటి అవరోధాలు లేకుండా పోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కెసీఆర్ ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం అయి 29 శాతం మేర పీఆర్ సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు అసలు పీఆర్సీ ఎంత ఉంటుందా అన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో ఉంది. పీఆర్సీ ప్రకటనకు అన్ని అవరోధాలు తొలగిపోవటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News