లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తాం అని బిఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్న వేళ సిట్టింగ్ ఎంపీ జంప్ అవటం కీలకంగా మారింది. అయితే కొంత మంది నేతలు మాత్రం గత కొంత కాలంగా పెద్దపల్లి ఎంపీ పార్టీ కి దూరంగా ఉన్నారు అని చెపుతున్నారు. పైకి ఎన్ని మాటలు చెపుతున్నా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఉన్న బిఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలనే చవి చూడాల్సి ఉంటుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.