టీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీలో వ‌చ్చేది 25 సీట్లే

Update: 2020-11-21 10:35 GMT

తెలంగాణ బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు 25కిమంచి సీట్లు రావ‌న్నారు. స్వ‌యంగా ఓ మంత్రే 25 సీట్లు వ‌చ్చినా మేయ‌ర్ త‌మ‌కే వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించార‌ని..స‌ర్వేలు అన్నీ కూడా టీఆర్ఎస్ కు 25 సీట్లే వ‌స్తాయ‌ని చెబుతున్నాయ‌న్నారు. వ‌ర‌ద నిలిపివేయాలంటూ నాయకుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని‌ ఎస్ఈసీ స్పష్టం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 'పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే‌‌ .. ప్రభుత్వానికి కేంద్రం నిధులిస్తోంది. బీజేపీని సమర్థిస్తున్న యువకులను చాలాన్ల పేర్లతో హింసిస్తున్నారు. నిజంగా నేనే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం నాపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఫోర్జరీ లేఖ గురించి నేను చేసిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదు. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటోంది' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'సమాజంలో 80 శాతం ఉన్న హిందువుల మనోభావాలే బీజేపీకి ముఖ్యం. భాగ్యలక్ష్మీ దేవాలయం గురించి టీఆర్ఎస్ నాయకులకు అవగాహన లేదు. భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేఖపై ఏ దేవాలయం దగ్గరైనా సీఎం కేసీఆర్‌తో చ‌ర్చకు సిద్ధం. నిజమైన హిందువు కాదు కాబట్టి.. కేసీఆర్ మక్కా మసీదుకైనా వస్తారని భావించాను. పేదలకు అందాల్సిన రైతుబంధును పొందుతోన్న కేసీఆర్, కేటీఆర్‌లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతాం. ఓట్లు కోసమే 40 వేల మంది రోహింగ్యాలను టీఆర్ఎస్ కాపాడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నారు' అని బండి సంజయ్ ఆరోపించారు.

Tags:    

Similar News