ఇద్ద‌రి నోటా ఒక‌టే మాట‌..అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్

Update: 2022-08-24 12:00 GMT

Full Viewరాజ‌కీయంగా ఒక‌రు అంటే ఒక‌రికి ఏ మాత్రం గిట్ట‌దు. కానీ బుధ‌వారం నాడు ఇద్ద‌రూ ఒకే మాట మాట్లాడారు. అయితే ఇందులో ఎవ‌రి ఏజెండా వారిది. కాక‌పోతే ఇద్ద‌రి నేత‌ల నోటా ఒకే మాట రావ‌టం విశేషం. లిక్క‌ర్ స్కామ్ విష‌యంలో సీఎం కెసీఆర్ కుటుంబంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల దృష్టిమ‌రల్చేందుకే తెలంగాణ స‌ర్కారు త‌న‌ను అరెస్ట్ చేసింద‌ని ఆరోపించారు. ఎవ‌రు అడ్డుకున్నా ప‌జాసంగ్రామ‌యాత్ర సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక‌గా మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'మోడీ ప్రభుత్వం కాదు, ఇది A-D ప్రభుత్వం; Attention Diversion. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర.

ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం. దేశం కోసం.. ధర్మం కోసం... అనేది బీజేపీ అందమైన నినాదం. విద్వేశం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు. SOCIAL MEDIA ద్వారా దేశంలోని.. SOCIAL FABRIC ను దెబ్బతీసే కుతంత్రం. మిత్రులారా గుర్తుంచుకోండి. ద్వేషం కాదు దేశం ముఖ్యం. ఉద్వేగాల భారతం కాదు..ఉద్యోగాల భారతం ముఖ్యం.' అంటూ పేర్కొన్నారు. ఇద్ద‌రు నేత‌లు మాట్లాడిన దాంట్లో కామ‌న్ పాయింట్ మాత్రం ప్రజల దృష్టి మరల్చే ప్ర‌య‌త్నం.

Tags:    

Similar News