నాలుగు వేరియంట్స్ లో

Update: 2024-08-27 15:10 GMT

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ తెలంగాణ మార్కెట్ లోకి కొత్తగా టీవీఎస్ జూపిటర్ 110 ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. టీవీఎస్ మోటార్ ద్విచక్ర వాహనాలతో పాటు త్రిచక్ర వాహనాల మార్కెట్ లో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. టీవీఎస్ జూపిటర్ 110 వాహనాల ప్రారంభ ధర 77100 రూపాయలుగా నిర్ణయించారు. నాలుగు వేరియంట్స్ లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. టీవీఎస్ జూపిటర్ 110 కమ్యూటింగ్ శ్రేష్ఠతలో కొత్త శకం అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధా హల్దార్ వెల్లడించారు. సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 వాహనాలు అసమానమైన డిజైన్, పనితీరు, సౌకర్యం మరియు సౌలభ్యం కలిగి ఉంటాయని తెలిపారు.

                                                               ఇన్ఫినిటీ లైట్ బార్, ప్రీమియం పియానో బ్లాక్ కాంట్రాస్ట్ ప్యానెల్స్, అత్యాధునికంగా మల్చిన ప్రొఫైల్‌ మేలు కలయికతో సరికొత్త డిజైన్ కలిగి ఉంటాయి ఈ వాహనాలు. డ్యుయల్ హెల్మెట్ అండర్-సీట్ స్టోరేజీ, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ స్పేస్ వీటి ప్రత్యేకతలు. అదనపు భద్రత కోసం రోటోపెటల్ డిస్క్ బ్రేక్‌లతో అత్యుత్తమ బ్రేకింగ్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రెస్ట్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, హజార్డ్ ల్యాంప్స్ మరియు మెటల్‌మ్యాక్స్ బాడీ ని టీవీఎస్ జూపిటర్ కలిగి ఉంటాయి. టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదార్లకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతోంది. 65 లక్షల మంది పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తోంది.

“గత దశాబ్దకాలంగా టీవీఎస్ మోటర్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోకి టీవీఎస్ జూపిటర్ 110 అనేది ఒక లంగరుగా ఉంటోంది. ఇన్నేళ్లలో 65 లక్షల కుటుంబాల నమ్మకాన్ని చూరగొంది. తద్వారా ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఆటోమోటివ్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఎదిగింది. సరికొత్తగా తీర్చిదిద్దిన ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్‌తో జ్యాదా కా ఫాయ్‌దా నినాదపు కీలక డీఎన్ఏ మరింత పటిష్టమైంది. ఆన్ డిమాండ్ టార్క్‌, మెరుగైన ఇంధన ఆదా, గణనీయంగా వినియోగించుకోతగిన స్థలం, సమకాలీన డిజైన్ వంటి ప్రత్యేకతలను అందించగలిగే సామర్ధ్యాల కారణంగా ఈ స్కూటర్ విశిష్టమైనదిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకతలన్నీ కూడా కస్టమర్లను సంతోషపర్చేందుకు, టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ వారి ప్రేమను చూరగొనేందుకు తోడ్పడగలవు” అని టీవీఎస్ మోటర్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. 

Tags:    

Similar News