హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కుదుపు తప్పదా?!

Update: 2023-05-19 13:21 GMT

Full Viewహైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్నది ప్రీమియం ఇల్లు..అపార్ట్ మెంట్లకే. మధ్యతరగతి కొనుగోలు చేసే కోటి రూపాయల లోపు యూనిట్స్ కు గత కొంత కాలంగా డిమాండ్ మందకొడిగా ఉంది. అదే సమయంలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండటంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తారు. ఇప్పుడు తెలంగాణ సర్కారు 111 జీఓను పూర్తిగా ఎత్తి వేయటంతో అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా హెచ్ఎండీఏ లో ఎలా అయితే అనుమతులు ఇస్తున్నారో...ఆ జీఓ పరిధిలో కూడా అలాగే అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ జీఓ పరిధిలో ఏకంగా లక్ష ముప్పై వేల ఎకరాలు అందుబాటులోకి రానుంది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెద్ద ఎత్తున సర్దుబాటు తప్పదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో రాబోయే రోజుల్లో రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ముఖ్యంగా కోకాపేట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ వేలంలో అధిక రేట్లు పెట్టి భూములు కొనుగోలు చేసిన వారికి తాజా పరిణామం ఒకింత షాక్ ఇచ్చేదే అని అధికారులు చెపుతున్నారు.

                                     జీఓ 111 ఎత్తివేయటం అంతా సాఫీగా సాగిపోతే ఆ ప్రాంతంలో రేట్లు తగ్గుతాయి అని రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. జీఓ 111 రద్దు ప్రకటన చేసిన సమయంలో తొలుత గ్రీన్ జోన్ లు ఏర్పాటు చేస్తారు అని ప్రకటించారు. ఇప్పుడు అవి ఏమీ ఉన్నట్లు లేవు. దీంతో ఇప్పుడు హెచ్ఎండీఏ లో ఎలా అయితే భూమి వాడకం ఉందో అక్కడ కూడా అలాగే వాడుకోవచ్చు అన్నమాట. దీంతో పెద్ద ఎత్తున భూమి అందుబాటులోకి రానుంది.అయితే ఇది అంత తేలిగ్గా జరిగే అవకాశం లేదు అని...న్యాయపరంగా చిక్కులు తప్పవనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా బిఆర్ఎస్ సర్కారు అటు రాజకీయ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలు పొందనుంది అని అధికారులు చెపుతున్నారు. ఇవి అన్నీ ఒకెత్తు అయితే ఇక్కడ తెర వెనక చాలా డీల్స్ జరిగాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.

Tags:    

Similar News