పూరి దారిన పడ్డాడా?! (Double ISMART Movie Review)

Update: 2024-08-15 06:38 GMT

పూరి జగన్నాథ్ ...రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇదే కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ ఆగస్ట్ 15 న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నది ఈ సినిమానే. అయితే మధ్యలో మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కూడా డబుల్ ఇస్మార్ట్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రేక్షకులు నిజంగానే ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ డబుల్ ఉంటుంది అని ఆశించారు. మరి వాళ్ళ ఆశలు నిజం అయ్యాయా?. ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే బిగ్ బుల్ పేరుతో సంజయ్ దత్ ఇండియా లో డ్రగ్స్, గన్స్ సరఫరా చేస్తూ..విదేశాల నుంచి మాఫియా సామ్రాజ్యం నడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఒక సారి సడన్ గా బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది...మూడు నెలలకు మించి బతకవు అని డాక్టర్లు బిగ్ బుల్ కు చెపుతారు.

                                                                         ఎట్టి పరిస్థితుల్లో తాను చనిపోవడానికి వీలు లేదు అని...ఎంత ఖర్చు అయినా సరే తాను బతకాలి...ముఖ్యంగా తన ఆలోచనలు బతకాలి అని చెపుతాడు. దీని కోసం డాక్టర్లు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతూ ఉంటాయి. కానీ చివరకు ఇప్పటికే ఒక సారి ఇలా ఒకరి మెదడు నుంచి మరొకరి మెదడుకు డేటా ట్రాన్స్ ఫర్ చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అని...వాడిని పెట్టుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది అని తెలుస్తారు. అప్పటి నుంచి హీరో రామ్ కోసం బిగ్ బుల్ టీం సర్వశక్తులు ఒడ్డుతుంది. మరి ఆ ప్రయత్నం ఫలించిందా లేదా అన్నదే డబుల్ ఇస్మార్ట్ సినిమా. అయితే డబుల్ ఎంటర్టైన్ మెంట్ ఆశించి ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు పూర్తిగా నిరాశే మిగులుతుంది అని చెప్పొచ్చు. హీరో రామ్ యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నా కూడా కథలో ఏ మాత్రం కొత్తదనం ...ఆసక్తికలిగించే అంశాలు లేకపోవటంతో ఏ దశలోనూ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

                                                              అసలు ఈ సినిమాలో అలీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. క్యారెక్టర్ పెట్టడం ఒక్కటే కాదు...దీని నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారింది అనే చెప్పాలి. ఈ సినిమాలో రామ్ కు జోడిగా నివేదా థాపర్ నటించింది. గ్లామర్ షో తప్ప...ఇందులో ఆమె పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాలో పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ లకు ఈ సినిమా పెద్ద నిరాశనే మిగిల్చింది ఈ డబుల్ ఇస్మార్ట్. డబుల్ ఇస్మార్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల చిప్ లకు షాక్ కొడుతోంది అనే చెప్పాలి.

                                                                                                                                                                                                                                                           రేటింగ్ : 2 / 5 

Tags:    

Similar News