రజనీ కాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత మంచి విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే. 2023 ఆగస్ట్ లో వచ్చిన జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 మూవీ ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి...ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తుందా లేదు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారిన అంశం. ఇదే జరిగితే తమిళ పరిశ్రమలో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఫస్ట్ మూవీ గా కూడా జైలర్ 2 నిలిచే అవకాశం ఉంది. ఆ రికార్డు రజనీకాంత్ పేర నమోదు అవుతుంది. జైలర్ 2 మూవీలో భారీ తారాగణమే ఉంది. రజనీ కాంత్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, రమ్య కృష్ణ, విద్యాబాలన్, మిర్న మీనన్, యోగి బాబు లు నటించారు. మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివ రాజకుమార్, జాకీ ష్రాఫ్ , విజయసేతుపతి అతిధి పాత్రల్లో కనిపిస్తారు.

                                                జైలర్ 2 సినిమాలో కథ కంటే కథను నడిపించిన విధానంతోనే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సక్సెస్ సాధించారు. కొంత మంది ముఠా పురాతన విగ్రహాలను దొంగతనాలు చేసి...విదేశాలకు అమ్ముకుంటుంది. ఆ టీం ను టార్గెట్ చేసే పాత్రలో హీరో రజనీకాంత్ కనిపిస్తారు. కథలో పెద్దగా కొత్తదనం ఏమి లేకపోయినా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేసేలా కథను నడిపించాడు దర్శకుడు. సింపుల్ కథకు రజనీ కాంత్ ఇమేజ్ కు తగ్గట్లు ఎలివేషన్స్ ఇచ్చాడు. అలాగే ఈ ఎలివేషన్స్ కు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుధ్ రవించందర్ మరింత జోష్ నింపాడు. జైలర్ 2 ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదా గా సాగిపోతుంది..మధ్యలో రజనీ కాంత్ మార్క్ ఎలివేషన్స్..ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ గా మారి...ఎమోషన్స్ యాడ్ అయినా కూడా యాక్షన్ సన్నివేశాలు...అతిధి పాత్రల హంగామా తో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది.

                                 టైగర్ ‘ముత్తువేల్ పాండియన్’ గా రజినీకాంత్ తన అభిమానులను ఎప్పటిలాగే ఫుల్ ట్రీట్ ఇచ్చాడు అని చెప్పాలి. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ బాగా మెప్పించాడు. ఎప్పటిలాగానే యోగి బాబు తనదైన మార్క్ కామెడీ తో ఆకట్టుకుంటాడు. రజనీ కాంత్ వయస్సును దృష్టిలో పెట్టుకుని జైలర్ ఎలా అయితే ఫైట్ సీన్స్ డిజైన్ చేసాడో...జైలర్ 2 లో కూడా అలాగే యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేశారు. జైలర్ 2 మూవీ లో విద్యా బాలన్ పాత్ర ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హై లైట్ గా నిలుస్తాయి. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని పెట్టిన రెండు ఐటెం సాంగ్స్ కూడా సినిమాలో మంచి జోష్ తెచ్చాయి. సినీ అభిమానులకే జైలర్ 2 మూవీ నచ్చుతుంది . అదే రజనీ కాంత్ ఫాన్స్ కు అయితే ఇక చెప్పే పనేలేదు. దసరా సెలవులను టార్గెట్ చేసుకుని వచ్చిన రజనీ కాంత్ జైలర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.

                                                                                              Full View                                 రేటింగ్ 3 .5 /5

Tags: