సీన్ మూవీ చూస్తే తెలుగు లో రవి తేజ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీ గుర్తుకు రావటం ఖాయం. ఎందుకంటే ఈ సినిమా లో కూడా పోలీస్ అధికారిగా ఉన్న సూర్య కు కళ్ళు కనిపించవు. ఉద్యోగానికి రాజీనామా చేసినా కూడా ఈ కేసులను సాల్వ్ చేసేందుకు ఇంట్లోనే ఉండి ప్రయత్నం చేస్తుంటాడు. తనకు సహాయకురాలిగా హీరోయిన్ నజ్రియా నజిమ్ ను నియమించుకుంటాడు. ఆమె తనకు కళ్ళు గా పని చేస్తుంది అని చెపుతాడు. ఆ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు కూడా. ఈ మూవీ లో కళ్ళు లేని పోలీస్ ఆఫీస్ పాత్రలో హీరో సూర్య తన పాత్రతో ఆకట్టుకున్నాడు. అయితే రాజా ది గ్రేట్ సినిమాతో పోలిస్తే ఇందులో ఎక్కడో జోష్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సినిమా మొత్తం మీద ఎక్కువ శాతం కామెడీ తోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
గతానికి భిన్నంగా ఈ సినిమాలో నస్లీన్ విలన్ గా కనిపించాడు. సీరియల్ కిల్లర్ పాత్రలో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సరదా సరదా యువకుడి పాత్రలు పోషించిన నస్లీన్ ఫస్ట్ టైం విలన్ గా కనిపించి సర్ప్రైజ్ చేస్తాడు అనే చెప్పాలి. నజ్రియా తన పాత్రతో ఆకట్టుకోవటమే కాకుండా ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో సూర్య హెయిర్ స్టయిల్ వెరైటీ గా ఉంటుంది..ఆయన తన పాత్రలో భాగంగా వివిధ రకాల హావభావాలతో ఆకట్టుకుంటాడు. సీన్ మూవీ లో యాక్టర్ లాల్ పాత్ర కూడా ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఓవరాల్ గా చూస్తే హీరో సూర్య సీన్ మూవీ ద్వారా కొద్దిలో హ్యాట్రిక్ సూపర్ హిట్ విజయాన్ని మిస్ చేసుకున్నాడు అనే చెప్పాలి. దీనికి కారణం ఇది జస్ట్ టైం పాస్ మూవీ గా ఉండటమే.
రేటింగ్ : 2 .75 /5