పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు 'గమనం' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. షూటింగ్ కు బయలుదేరే ముందు ఆయన సుజనారావు తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం 'గమనం'. ట్రైలర్ విడుదల చేశారు. మొత్తం అయిదు భాషల్లో(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) రూపొందుతున్న ఈ సినిమాలో శ్రియ శరణ్ నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్‌ను వీక్షించారు.

చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మొత్తం అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ను పవన్‌ విడుదల చేశారు. హిందీలో సోనూసూద్‌, తమిళ్‌లో జయం రవి, కన్నడలో శివరాజ్‌ కుమార్‌, మలయాలళంలో ఫహద్‌ ఫసిల్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

Full View

Tags: