చెన్నై లవ్ స్టోరీ

Update: 2026-07-25 11:12 GMT

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 12 .3 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. గురువారం నాడు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ తో కలుపుకుని ఈ మొత్తం సాధించినట్లు తెలిపారు. దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తం అయినా కూడా కలెక్షన్స్ ఆశాజనంగానే ఉన్నాయి అని చెప్పాలి.

                             Full Viewఈ మూవీకి శనివారం నాడు బుకింగ్స్ కూడా మెరుగ్గానే ఉన్నాయి. హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఫస్ట్ డే ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో వసూళ్లు రావటం ఇదే మొదటి సారి కావటం విశేషం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా సాయి రాజేష్ కథ అందించారు. చెన్నై లవ్ స్టోరీ మూవీ విషయంలో ఫస్ట్ హాఫ్ బాగుంది అని ఎక్కువ మంది ఆభిప్రాయపడగా...సెకండ్ హాఫ్ విషయంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అయింది. అదే సమయంలో నిడివి కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది అనే అభిప్రాయం ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నారు.

Tags:    

Similar News