టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో తన అభిమానులతో సమావేశం అయ్యారు. ఇందులోనే ఆయన సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ఎవరైనా సరే నచ్చని వాళ్ళను వదిలేసి...మనకు నచ్చిన పనులపై దృష్టి పెట్టడం ఎంతో అవసరం అన్నారు. మనకు నచ్చని వాళ్ళ కోసం డబ్బు ఎలా ఖర్చుపెట్టమో...అలాగే టైం విషయంలో కూడా నచ్చని వాళ్ళను వదిలేసి పూర్తిగా మనకు నచ్చిన పని చేసుకోవాలన్నారు. నచ్చని వ్యక్తుల కోసం మన డబ్బు..సమయం ఎందుకు వృధా చేసుకోవాలన్నారు. కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటికి ముందుకు వెళ్లి కాలం గడపండి..అది కనీసం మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ పై స్పందించటం కంటే ఆ సమయాన్ని సొంత ఎదుగుదలకు ఉపయోగించుకోవాలన్నారు. టైం..ఎనర్జీ ఏది అయినా వంద శాతం మన కోసమే వాడుకోవాలన్నారు.
ప్రతి మనిషి లో ఉండే వంద శాతం ఎనర్జీ ని దేని కోసం వాడతారు అనేది ఎంతో ముఖ్యం అన్నారు. ప్రతి మనిషికి రోజుకు వంద శాతం ఎనర్జీ ఉంటుంది అని..దాన్ని దేనికి వాడతాం అనేది మన ఇష్టం అన్నారు. అంతే కానీ..మనకు నచ్చని వాళ్ళను హేట్ చేసి..ట్రోల్ చేసి...నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు అని అభిమానులకు సూచించారు. అభిమానులతో ఇలా సమావేశం అవటం ఎంతో ఆనందంగా ఉంది అని...ఎప్పటి నుంచో ఇలాంటి సమావేశంలో ఈ విషయాలు చెప్పటం కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రాకాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పడుకొనే నటిస్తోంది. ఇదే ఈవెంట్ లో ఒక అభిమాని దేవుడి విగ్రహాలతో కూడిన ఒక బహుమానం అందించే సమయంలో అల్లు అర్జున్ షూస్ విప్పేసి దాన్ని తీసుకున్న వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.