షూటింగ్ కు బ్రేక్ తప్పదు!

Update: 2026-07-21 09:06 GMT

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు షూటింగ్ లో గాయం అయింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ బీకె 111 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా బాలకృష్ణకు ప్రమాదం జరిగింది..ఇందులో ఆయన మోకాలికి గాయం అయినట్లు చెపుతున్నారు. వెంటనే బాలకృష్ణను హాస్పిటల్ కు తీసుకెళితే ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత మరో హాస్పిటల్ లో బాలకృష్ణకు స్కానింగ్ చేసి గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు కొంత కాలం విశ్రాంతి అవసరం అని సూచించారు. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది అని దర్శకుడు మలినేని గోపీచంద్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

                                   Full Viewబాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీరసింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితం దక్కించుకోవటంతో ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో రానున్న మూవీ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సినిమా విషయంలో బాలకృష్ణకు ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది గోపీచంద్ వెల్లడించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.

Tags:    

Similar News