ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఏమీ ఆగిపోదు. తొలిప్రేమ ఏమి తోపు కాదు అంటూ సినిమా స్టోరీలైన్ ఎలా ఉంటుందో చెన్నై లవ్ స్టోరీ చిత్ర యూనిట్ ఒక పాట ద్వారా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే సినిమాపై అంచనాలు పెంచటానికి..యువతలో బజ్ క్రియేట్ చేయటానికి ఎంతో ఉపయోగపడింది. యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా కాంబినేషన్ లో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రీమియర్ షోస్ గురువారం రాత్రే వేశారు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం భారీ ఆశలే పెట్టుకున్నాడు. దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాను తెరకెక్కించగా...ఎస్ కెఎన్, సాయి రాజేష్ లు నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాకు సాయి రాజేష్ కథ కూడా అందించారు. ఈ సినిమా కథ హీరోయిన్ లవ్ స్టోరీ...పెళ్లి ఆగిపోయిన సన్నివేశాలతోనే మొదలవుతుంది. మూడేళ్లు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవటాని అంతా రెడీ అయిన తరుణంలో చివరి నిమిషంలో తాను తన ఆఫీస్ లో మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నానని..పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తాడు గౌరీప్రియ ప్రేమికుడు. ఈ పాత్రలో త్రిగుణ్ నటించాడు.
హీరోయిన్ గౌరీ ప్రియా చెన్నైలో ఉద్యోగం చేస్తుంటుంది. ఎలాగైనా సరే వెండితెరపై తన పేరు చూసుకోవాలని..సినిమా తీయాలనే లక్ష్యంతో హీరో కూడా చెన్నై వస్తాడు. చెన్నై బీచ్ లో ఒక కథ చెప్పే క్రమంలోనే హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ ఫ్రెండ్స్ టీంకు పరిచయం అయి వాళ్ళ టీంలో చేరిపోతారు. పెళ్లి ఆగిపోయిన తర్వాత గౌరీ ప్రియా లైఫ్ లోకి హీరో కిరణ్ అబ్బవరం ఎలా వస్తాడు. మరి వీళ్లిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా ...లేదా అన్నదే చెన్నై లవ్ స్టోరీ మూవీ. ఈ మూవీ లో హీరో కిరణ్ అబ్బవరం. శ్రీ గౌరీ ప్రియలు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో కంటే హీరోయిన్ గౌరీ ప్రియ ప్రేమ విఫలం అయిన యువతి పాత్రలో మంచి నటన కనపర్చింది. కాకపోతే సినిమాలో ఎక్కువ శాతం ఆమె మందు తాగుతున్నట్లే చూపించారు. ఈ సీన్లు అవసరానికి మించి పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు.
ఈ మూవీ లో అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ లో వస్తుంది. దీంతో అసలు ఈ సినిమా ఎలా ముందుకు సాగుతుంది అన్న అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. దర్శకుడు ఏదో ప్రయత్నం చేసినా అది ఎంత మేర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్నది అనుమానమే. ఫస్ట్ హాఫ్ లో ఒక హోటల్ లో జరిగిన సన్నివేశానికి...సెకండ్ హాఫ్ సినిమా నడపటానికి కథను లింక్ అయితే చేశారు కానీ ఇది నడిపించిన విధానం ఏ మాత్రం ఆకట్టుకోదు. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా చూస్తే చెన్నై లవ్ స్టోరీ మూవీ లో జోష్ మిస్ అయింది. ప్రేక్షకులకు ఇది ఒక నీరసమైన ప్రేమ కథగా అనిపిస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమా కథ పాయింట్ లో ఒకింత కొత్తదనం ఉన్నా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో చిత్ర యూనిట్ సఫలం కాలేకపోయింది.
రేటింగ్ : 2 .5 /5