టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో హీరో సత్యదేవ్ ఒకరు. కాకపోతే ఆయనకు ఇప్పటివరకు ఒక్క సూపర్ హిట్ దక్కలేదు. ఇటీవలే సత్యదేవ్ హీరో గా నటించిన రావు బహదూర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు రావు బహదూర్ మూవీ ఓటిటి లోకి వస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్ లలో అందుబాటులో ఉంటుంది అని వెల్లడించారు. ఈ సినిమా జులై మూడునే విడుదల అయింది. విడుదల అయి నెల రోజులు కూడా కాకముందే రావు బహదూర్ సినిమాను ఓటిటిలోకి తెస్తున్నారు.
కేరాఫ్ అఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకటేష్ మహా నే ఈ సినిమాను తెరకెక్కించటంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు జీఎంబి ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రెజంట్ చేశారు. సినిమాకు బజ్ క్రియేట్ చేయటానికి ఇవి అన్నీ ఉపయోగపడిన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమాలో సత్యదేవ్ కు జోడిగా దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభా