మూడు రాజధానులపై రిఫరెండం పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన డిమాండ్ పై వైసీపీ స్పందించలేదు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉంటే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే ఈ అంశంపై మాట్లాడిన మంత్రులు ఎవరూ కూడా రిఫరెండం సవాల్ ను అంగీకరించలేదు. కావాలనుకుంటే చంద్రబాబే తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకుంటే అప్పుడు రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని ప్రకటించారు.
ప్రజలు జగన్ కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని..తమకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించారని..వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును కూడా ఇంటికి పంపించటం ఖాయం అంటూ ప్రకటించారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పేపర్ పులి మాత్రమే అన్నారు. చంద్రబాబు ఆరాటం అంతా తన వర్గ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదన్నారు.