వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గురువారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా మోడీని కోరారు.