జగన్ కు మోడీ పెద్ద లెక్క కాదు

Update: 2021-02-08 09:08 GMT
జగన్ కు మోడీ పెద్ద లెక్క కాదు
  • whatsapp icon

వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను జరగనీయబోమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సీఎం జగన్ కోరారన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఎవరో చూడాలన్నారు. 130 సంవత్సరాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ నే జగన్మోహన్ రెడ్డి మట్టికరిపించారన్నారు.

జగన్ కు మోడీ పెద్ద లెక్క కాదన్నారు. సోమవారం ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు వద్ద అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొని తమ నిరసన తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News