తెనాలి లో షాకింగ్ ఘటన

Update: 2024-05-13 07:30 GMT

Full Viewవైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ కు షాక్ . ఈ ఎన్నికల్లో ఆయనే తిరిగి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తెనాలి నియోజకవర్గంలోని ఒక బూత్ లో ఓటు వేయటానికి వెళ్లిన ఎమ్మెల్యే కి చేదు అనుభవం అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులతో కలిసి నేరుగా వెళ్లటంపై ఓటర్ అభ్యంతరం చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శివ కుమార్ సదరు ఓటర్ చెంపపై గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంప పై గట్టిగా కొట్టాడు. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఓటర్ పై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఒక్క మాట మాట్లాడినందుకు ఓటర్ పై ఎమ్మెల్యే దాడి చేయటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 

Tags:    

Similar News