టీటీడీ ఛైర్మ‌న్ గా సుబ్బారెడ్డి...జీవో జారీ

Update: 2021-08-08 07:32 GMT

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ ప‌ద‌వి మ‌రోసారి వై వీ సుబ్బారెడ్డికే ద‌క్కింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే ఇందులో విచిత్రంగా ఈ సారి ఆయ‌న ఏడాదిపాటు ప‌దవిలో ఉంటారా..లేక రెండేళ్లా అన్న అంశాన్ని ఎక్క‌డా ప్ర‌స్తావించకుండా జీవో జారీ చేశారు. అయితే త్వ‌ర‌లోనే కొత్త బోర్డును ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మాత్రం జీవోలో ప్ర‌స్తావించారు.

ఈ మేర‌కు ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి జి. వాణి మోహ‌న్ ఆదివారం నాడు జీవో జారీ చేశారు. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కే మ‌ళ్లీ ఈ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే వై వీ సుబ్బారెడ్డి రాజ్య స‌భ సీటు లేదా ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి ప‌ద‌వి కోరిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా నిర్ణ‌యంతో ప్ర‌స్తుతానికి ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్లు అయింది. 

Tags:    

Similar News