ప్రమాణంలో తడబడ్డ వైసీపీ అధినేత

Update: 2024-06-21 14:50 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో శుక్రవారం నాడు ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అయితే అందరి కళ్ళు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనే ఉన్నాయనే చెప్పాలి. ఐదేళ్ల పాటు 151 మంది ఎమ్మెల్యేలతో సభలో పూర్తి ఆధిపత్యం చూపిన వైసీపీ ఇప్పుడు కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ అసలు అసెంబ్లీకి వస్తారా లేదా అన్న అంశంపై విస్తృతంగా చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే జగన్ మాత్రం శుక్రవారం నాడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మాత్రం సభలో ఉండి..అది అయిపోగానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.

                                         ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తడబడ్డారు. తొలుత జగన్ మోహన్ అనే నేను అని చెప్పి తర్వాత జగన్ మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే అందరికి నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ లో వైసీపీ కి ఉన్న సంఖ్య చాలా పరిమితం అయినందున సభలో పోరాటం చేయటం సాధ్యం అవుతుంది అని అనుకోవటం లేదు అని జగన్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో జగన్ భవిష్యత్ లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్న అంశంపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 

Tags:    

Similar News